విజయ్ సేతుపతి తో  సమంత

10 Feb,2019

అక్కినేని సమంతా డైరీ ఇప్పట్లో ఖాళీ అయ్యేలాగా కనిపించడం లేదు. నాగ చైతన్యతో మజిలి షూటింగ్ లో బిజీగా ఉన్న సాం వచ్చే నెల నుంచి  తమిళంలో సూపర్ హిట్ అయినా 96 రీమేక్ కోసం శర్వానంద్ తో కలిసి నటిస్తోంది.  మరోవైపు నందిని రెడ్డి దర్శకత్వంలో మూవీ కూడా శరవేగంగా జరుగుతోంది. త్వరలో తమిళ  హీరో విజయ్ సేతుపతితో సమంతా జట్టు కట్టే అవకాశాలు ఉన్నాయని చెన్నై టాక్. ఈ ఇద్దరు ఇదివరకే సూపర్ డీలక్స్ అనే మూవీ చేసారు. అది విడుదలకు సిద్ధంగా ఉంది. విజయ్ సేతుపతి ట్రాన్స్ జెండర్ గా నటించిన ఆ మూవీలో సమంతా కిల్లర్ పాత్ర పోషించిందని టాక్. ఇప్పుడు మరోసారి సేతుపతి తో జోడి కడుతుంది. అన్నట్టు ఈ సినిమాకు తుగ్లక్ అనే టైటిల్ పెడుతున్నట్టు టాక్.  అయితే ఇది అధికారికంగా ఖరారు అయ్యే అవకాశాలు ఉన్నాయి .  ఈ  తుగ్లక్ అవుట్ అండ్ అవుట్ పొలిటికల్ సెటైర్స్ తో ఉంటుందట. ఢిల్లీ ప్రసాద్ దీన్దయాలన్ అనే డెబ్యు దర్శకుడు దీన్ని హ్యాండిల్ చేయబోతున్నారు.   గత ఏడాది 96-చెక్క చివత వానం-సీతకతి తో మూడు నెలల్లో హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన విజయ్ సేతుపతికి కమల్ హాసన్-విక్రంల తర్వాత అంత విలక్షణమైన నటుడనే పేరుంది. 

Recent News